తులసి రెడ్డి సమక్షంలో దళిత నాయకురాలికి అవమానం
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు ప్రాణం పోసింది మేమేనంటూ జబ్బలు చరుచుకునే కాంగ్రేస్ నేతల నిజస్వరూపం బట్టబయలైంది. దళితబంధు అని సగర్వంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీలో దళితులపై వివక్ష బట్టబయలైంది. సాక్షాత్తూ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ తులసిరెడ్డి సమక్షంలోనే ఆహ్వానం లేదంటూ, తూర్పు గోదావరి జిల్లా ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్యామలా దేవిని ఈవేళ కాకినాడలో జరిగిన పార్టీ సమావేశం నుంచి బయటకు పంపారు. డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వరరావు ఆమెను బయటకు పంపడంపై శ్యామలాదేవి పార్టీలో దళితులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.